హైదరాబాద్ : జీఎస్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులతో బీఆర్కే భవన్ లో సమన్వయ సమావేశం జరిగింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే ట్యాక్స్ వసూళ్లలో గణనీయమైన పురోగతి లభిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. మరింత సమన్వయం, పన్ను వసూళ్ల పురోగతిని సమీక్షించడానికి రెగ్యులర్ గా ప్రతీ వారం సమన్వయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పన్ను వసూళ్లకు సంబంధించి ప్రత్యేక కమిటీలతో ప్రత్యేక రెవెన్యూ డ్రైవ్ లను చేపట్టామన్నారు. ఎటువంటి సమస్యలు లేకుండా పన్ను వసూళ్లు చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయుటకు పరస్పర సహకారం అందించుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో సీజీఎస్టీ హైదరాబాద్ ఛీఫ్ కమీషనర్ మల్లికా ఆర్యా, స్టేట్ ట్యాక్స్ కమీషనర్ నీతూ కుమారి ప్రసాద్, సీజీఎస్టీ హైదరాబాద్ ప్రిన్సిపల్ కమీషనర్ పురుషోత్తం, సీజీఎస్టీ మేడ్చల్ కమీషనర్ శ్రీధర్, సికింద్రాబాద్ & రంగారెడ్డి కమీషనర్ యం.ఆర్.ఆర్.రెడ్డి, రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm