హైదరాబాద్ : ఈరోజు బాల్ భవన్ డైరెక్టర్ ఆఫీస్ లో జరిగిన నేషనల్ సైన్స్ డే సందర్భంగా గత నెలలో డ్రాయింగ్ మాస్టర్ కప్పరీ కిషన్ ఆన్ లైన్ డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో స్టేట్ లెవెల్ లో సూర్యాపేట బాల కేంద్రం స్టూడెంట్స్ మీసాల సృజన కీర్తి, సాయి వర్షిత, గ్రీటింగ్ కార్డుల పోటీలలో అనికలు విజేతలుగా నిలిచారు. విజేతలకు డైరెక్టర్ యం.రాధా రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా బాల కేంద్రం నుండి ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్స్ లలిత కళలు శిక్షణ పొందుతూ అన్ని రకాల పోటీలలో పాల్గొని విజేతలుగా నిలవడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి మేడం, ఇతర బాల్ భవన్ డైరెక్టర్ ఆఫీస్ స్టాఫ్, జిల్లా బాల కేంద్రం సూర్యాపేట స్టూడెంట్స్, పేరెంట్స్, సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm