న్యూఢిల్లీ: కొవిడ్ కేసులు పెరుగుతున్నందున అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగించినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) పేర్కొంది. కార్గో విమానాలు, డీజీసీఏ అనుమతి పొందిన వాటికి నిషేధం వర్తించదని తెలిపింది. ప్రభుత్వం వందే భారత్ మిషన్ కింద కొన్ని దేశాలకు విమాన సర్వీసులు నడుపుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm