హైదరాబాద్: కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ ఈరోజు నగరానికి రానున్నారు. పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని కేంద్రమంత్రి ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హోటల్ మారియట్‌లో గ్రాడ్యుయేట్స్‌తో ప్రకాష్ జావడేకర్, బండి సంజయ్ సమావేశంకానున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఐవీఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొననున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm