హైదరాబాద్: ఫన్ ల్యాబ్ టెక్నాలజీస్ సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. సెక్యురిటీ డిపాజిట్ పేరుతో ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.20వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఆపాయింట్ మెంట్ లెటర్స్ ఇచ్చిన నెలరోజుల్లోపే సంస్థ చేతులెత్తేసిందని లబోదిబోమంటున్నారు. సంస్థ యజమాని పరారీలో ఉన్నాడని, గతంలో కూడా ఇలాగే చేశాడని బాధితులు ఆరోపించారు. ఫన్ ల్యాబ్ టెక్నాలజీస్ సంస్థ యజమానిపై పోలీసులకు బాధితుల ఫిర్యాదు చేశామని, నేడు లేబర్ కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm