ములుగు: మేడారం చిన్న జాతరలో మాఘ శుద్ధ పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి. సమ్మక్క జాతరలో ఈ పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉన్నది. నిండు పౌర్ణమి రోజునే సమ్మక్క దేవత గిరిజనులకు దొరికింది. పౌర్ణమి నాడే గిరిజనులను వీడి వన ప్రవేశం చేసింది. దీంతో పౌర్ణమిని పురస్కరించుకునే మహాజాతర, చిన్న జాతర నిర్వహిస్తున్నారు. శనివారం పౌర్ణమి రోజు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా వస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm