హైదరాబాద్ : దేశంలో టిక్ టాక్ యాప్ బ్యాన్ అయిన విషయం తెలిసిందే. టిక్ టాక్ బ్యాన్ అనంతరం అలాంటి యాప్స్ చాలానే వచ్చాయి. తాజాగా ఫేస్‌బుక్ ఇంటర్నల్ ఆర్ అండ్ డీ గ్రూప్ అయిన న్యూ ప్రొడక్ట్ ఎక్స్‌పెరిమెంటేషన్ (ఎన్‌పీఈ) బృందం ప్రయోగాత్మక యాప్ బార్స్ (బీఏఆర్‌ఎస్) ను ఇవాళ అందుబాటులోకి తీసుకొచ్చింది. టిక్ టాక్ మాదిరిగా క్రేజ్‌ను కూడగట్టుకునేలా ఈ యాప్‌ను ప్రత్యేకంగా రాపర్ల కోసం రూపొందించారు. సింగర్లు ఎవరైనా తమ ర్యాప్‌ను సిద్ధం చేసి ప్రత్యక్ష సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఈ యాప్ అవకాశం కల్పిస్తున్నది. ఈ యాప్ ఫేస్‌బుక్ యొక్క ఎన్‌పీఈ బృందం తయారుచేసిన రెండో మ్యూజిక్ యాప్. అంతకుముందు కొల్లాబ్ అనే మ్యూజిక్ వీడియో యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కొల్లాబ్ యాప్ సంగీతంతో ప్రారంభించి ఒరిజినల్ వీడియోలను సృష్టించడానికి, చూడటానికి, కలపడానికి, సరిపోల్చడంతోపాటు సంగీతం సృష్టికర్తలు, అభిమానులను ఒకచోట చేర్చడానికి ఉపయోగపడుతున్నది. కాగా, సింగర్స్ సొంతంగా రాపర్స్ వీడియోలను తయారు చేసుకోవడం, పంచుకోవడం ఈ బార్స్ ప్రత్యేకత. యాప్‌లో వందలాది బీట్‌లు అందుబాటులో ఉంచారు. వీటిలో నుంచి ఒకదానిని ఎంచుకుని వినియోగదారులు తమ వీడియోను సిద్ధం చేసుకోవచ్చు.
ఈ యాప్ స్వయంచాలకంగా సాహిత్యం యొక్క ప్రాసలను కూడా అందిస్తుండటం ఈ యాప్ ప్రత్యేకత. 60 సెకన్ల వీడియోను సృష్టించడానికి ఈ యాప్ ఛాలెంజ్ మోడ్‌ను కూడా ఇచ్చింది. ఇక్కడ, వినియోగదారులు ఆటో సడన్ పదాలతో క్యూ చెప్పి ఫ్రీస్టైల్‌లో పూర్తిచేయవచ్చు. ఇది ఒకరకంగా ఆట లాంటి మోడ్. ర్యాప్‌ను ఆస్వాదించాలనుకునేవారి కోసం ఈ యాప్‌ను రూపొందించారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసే వీడియో నిడివి 60 సెకన్ల వరకు ఉండొచ్చు. వీడియోను రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఫోన్ గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఈ బీఏఆర్‌ఎస్‌ను రూపొందించడంలో ఫేస్‌బుక్ ఎన్‌పీఈ బృందం కీలక పాత్ర పోషించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Feb,2021 02:33PM