హైదరాబాద్ : ఏపీలో గడచిన 24 గంటల్లో 37,041 కరోనా పరీక్షలు నిర్వహించగా 118 మందికి పాజిటివ్ అని తేలింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 33 కొత్త కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల వ్యవధిలో చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఇక ఇతర జిల్లాల విషయానికొస్తే... తూర్పు గోదావరిలో 14, విశాఖలో 14, గుంటూరు జిల్లాలో 13 కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 86 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 8,89,799 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,963 మంది కోలుకున్నారు. ఇంకా 667 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,169గా నమోదైంది.
Mon Jan 19, 2015 06:51 pm