హైదరాబాద్ : ప్రమాద వశాత్తు మూడు గ్యాస్ సిలిండర్లు పేలి రెండిళ్లు పూర్తిగా దగ్ధమైన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో మూడు గ్యాస్ సిలిండర్లు పేలగా.. రెండు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన కోట నగేష్ అతని కుమారుల కుటుంబాలకు చెందిన ఇళ్లు మంటల్లో కాలిపోయాయి. కూలి పనుల కోసం అందరూ బయటకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. ఒక సిలిండర్ పేలి దాని వెనక ఉన్న సిలిండర్లకు మంటలు అంటుకున్నాయి. ఇటీవల మిర్చి పంట విక్రయించగా వచ్చిన రూ. 2.7 లక్షల నగదుతో పాటు ద్విచక్ర వాహనం, ఇంట్లోని ఇతర సామాన్లు పూర్తిగా కాలిపోయాయని బాధితులు గోడు వెల్లబోసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm