హైదరాబాద్ : ప్రకాశం బ్యారేజీ పైనుంచి కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందో వివాహిత. ఇది గమనించిన ఏపీఎస్పీ కానిస్టేబుల్, పర్యాటక ఉద్యోగులు ఆమెను రక్షించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద జరిగింది. భర్తపై కోపంతోనే నదిలోకి దూకేసినట్లు సదరు మహిళ వెల్లడించింది. దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
Mon Jan 19, 2015 06:51 pm