హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24గంటల్లో 16,752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,96,731కు పెరిగాయి. కొత్తగా 11,718 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,07,75,169 మంది కోలుకున్నారని మంత్రిత్వశాఖ చెప్పింది. మరో 113 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,57,051కు పెరిగిందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 1,64,511 యాక్టివ్ కేసులున్నాయని, టీకా డ్రైవ్‌లో భాగంగా 1,43,01,266 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది.
Mon Jan 19, 2015 06:51 pm