హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. షాద్ నగర్ బైపాస్ సమీపంలో వై జంక్షన్ వద్ద వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పిన డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వారు హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm