హైదరాబాద్ : మార్చి 4వ తేదీన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తిరుపతిలో జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ర్టాల సీఎంలు అదేవిధంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొననున్నారు. అండమాన్ నికోబార్ దీవులు, లక్ష్యాదీవుల లెఫ్టినెంట్ గవర్నర్స్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర ఉన్నతాధికారులు దాదాపు వంద మంది వరకు భేటీలో పాల్గొననున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm