హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్పై వెళ్తున్న దంపతులను బొలెరో వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బాధితులు గూడూరు మండలం అయోధ్యపురం గ్రామానికి చెందిన వీరయ్య, ప్రకృతిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm