అమరావతి: ఏపీలో తర్వలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కృష్ణా, గుంటూర్, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలను వారితో చర్చించారు. ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదేవిధంగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు వివిధ పార్టీల నాయకులతో ఎస్‌ఈసీ సమావేశం కానున్నారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై వారితో చర్చించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm