హైదరాబాద్: 2020 సినీ ఇండస్ట్రీకి అంతగా కలిసి రాలేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా ఎంతో మంది సినీ ప్రముఖులు కన్నుమూసారు. ఇక 2021 కొత్త యేడాదిలో అంతా బాగుంటుందనుకుంటే.. కొత్త యేడాదిలో ప్రతివారం ఎవరో ఒకరు కన్నుమూస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారు వరుసగా ఈ లోకాన్ని విడిచి వెళ్లడాన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లకు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ ఆదివారం ప్రముఖ నిర్మాత సందీప్ కొరిటాల గుండెపోటుతో కన్నుమూసారు. ఈయన నారా రోహిత్‌తో ‘రౌడీ ఫెలో’తో పాటు నిఖిల్ సిద్ధార్ధ్ హీరోగా నటించిన ‘స్వామి రారా’ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. నా నిర్మాత.. శ్రేయోభిలాసి సందీప్ కొరిటాల ఇక లేరనే విషయం తెలుసుకొని చాల బాధగా ఉందని ట్వీట్ చేసారు.
Mon Jan 19, 2015 06:51 pm