హైదరాబాద్: నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో లవ్ స్టోరి పేరుతో శేఖర్ కమ్ముల హైదరాబాద్ నేపథ్యంలో ఓ ప్రేమకథను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్ 16న థియేటర్‌లో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాకు సంబంధించి ఒక్కో పాటను విడుదల చేస్తూ మూవీపై అంచనాలు పెంచుతున్నారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగా తాజాగా ‘సారంగ దరియా’ అంటూ సాగిపోయే పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటను సమంత తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేసి ఆల్ ది బెస్ట్ చెప్పింది. సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ పాటను తీన్మార్ మంగ్లీ పాడింది. ఇక ‘సారంగ దరియా’ అంటూ సాగే ఈ మాస్ బీట్‌కు సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులు వేసి అదరగొట్టింది. ఈ పాటలో సాయి పల్లవి తన మాస్ట్ స్టెప్పులతో అదరగొట్టిందనే చెప్పోచ్చు. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చైతు , సాయిపల్లవి ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణ దాస్ కె.నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ చిల్లం సంగీతం అందించాడు.
Mon Jan 19, 2015 06:51 pm