కొలంబో: ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ టామ్ మూడీని క్రికెట్ డైరెక్టర్గా నియమించినట్టు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) తెలిపింది. శ్రీలంక క్రికెట్ వ్యవహారాలను మెరుగుపరిచేందుకు నడుంబిగించిన బోర్డులోని సాంకేతిక సలహా కమిటీ మూడీ పేరును క్రికెట్ డైరెక్టర్ పదవికి ప్రతిపాదించింది. పరిశీలించిన ఎస్ఎల్సీ మూడీ నియామకాన్ని ధ్రువీకరించింది. టామ్ మూడీని 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్' గా నియమించినట్టు పేర్కొన్న లంక బోర్డు.. మార్చి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ట్వీట్ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm