హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య సమయంలో నిందితులు వినియోగించిన కత్తిని పోలీసులు గుర్తించారు. మరో కత్తి కోసం గాలింపును ముమ్మరం చేశారు. పార్వతీ బ్యారేజీ వద్ద నిందితులు మారణాయుధాలను పడేసినట్లు గుర్తించిన పోలీసులు రెండ్రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. నిన్నంతా వెతికినా ఆయుధాలు లభించకపోవడంతో ఇవాళ గాలింపు చర్యలు చేపట్టారు. ఏపీ నుంచి రప్పించిన గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. మళ్లీ నేడు కుంట శ్రీనుని ఘటన స్థలానికి తీసుకెళ్లి... కొడవళ్లు పడేసిన చోటుపై విచారణ జరిపారు. మారణాయుధాలను వెలికి తీసేందుకు పెద్ద పెద్ద ఐస్కాంతాలను వినియోగిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టారు. బ్యారేజీ వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm