హైదరాబాద్ : ఉత్తర్ప్రదేశ్లోని చిత్రకూట్లో దారుణం జరిగింది. రాయ్పురా గ్రామంలో ఏడేళ్ల చిన్నారిపై 12 ఏళ్ల బాలుడు లైంగిక దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. చిన్నారిని తన ఇంట్లోకి తీసుకెళ్లిన బాలుడు.. లైంగిక దాడికి పాల్పడ్డాడని రాయ్పురా పోలీసు అధికారి సుశీల్ చంద్ర శర్మ తెలిపారు. జరిగిన విషయాన్ని బాధిత చిన్నారి తన తల్లితండ్రులకు వివరించగా.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మైనర్ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm