హైదరాబాద్: లక్షలాది మంది సమక్షంలో షర్మిల పార్టీ పేరు ప్రకటించనున్నారు. ఏప్రిల్ 9న పార్టీ పేరును ప్రకటించాలని వైఎస్ షర్మిల ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 9న లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించాలని ఆమె నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ఆమె ఖమ్మం జిల్లా నేతలతో చర్చించారు. ‘వైఎస్సార్‌టీపీ’.. ‘వైఎస్సార్ పీటీ’.. రాజన్నరాజ్యం అనే పేర్లను ఆమె ఇందుకోసం పరిశీలించారు. మే14 నుంచి లోటస్ పాండ్ వేదికగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో చివరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తుండగా...అదే రోజు పార్టీ పేరును సైతం ఖమ్మం సభ వేదికగానే ప్రకటించేందుకు రంగంసిద్ధం చేసుకుంటున్నారు. మే 14 రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తేదీని పార్టీ ఏర్పాటు చేయాలనుకున్నా..ఎండల తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో అప్పుడు సభ పెట్టలేమని భావించినట్టు తెలుస్తోంది. అయితే మే14న పార్టీ వ్యవహారాలను లోటస్‌పాండ్ నుంచే ప్రారంభిస్తే బాగుంటుందన్న ఆలోచనలో షర్మిల ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm