హైదరాబాద్: భూకబ్జాల ఆరోపణలతో వివాదాస్పదుడిగా ముద్ర పడ్డ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై మరో వివాదం రాజుకుంటోంది. తన సొంత భూములకు ధరలు పెంచేందుకు రైతుల భూములను ఆక్రమించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకాన్ని సైతం దుర్వినియోగం చేశారని అంటున్నారు. జనగామ జిల్లా నర్మెట్ట మండలం హన్మంతాపూర్ వద్ద ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఫామ్‌హౌస్ ఉంది. దీంతో అక్కడికి వెళ్లేందుకు ఉన్న రోడ్డును విస్తరించేందుకు ఆ రోడ్డు వెంట ఉన్న రైతుల పొలాలపై గురి పెట్టారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డు వెంట మొక్కలు నాటాలని, ఇందుకోసం రోడ్డు విస్తరణ చేపడుతున్నామని చెప్పి.. గత జనవరిలో రైతుల పొలాల్లోని పంటలను తొలగించారు. రోడ్డు మధ్యలో నుంచి అటూ ఇటూ 45 ఫీట్ల వరకు పొలాలను చదును చేయించారు.
ఎమ్మెల్యే దగ్గరుండి మరీ మొక్కలు నాటిం చారు. కానీ, దీనికి ఎలాంటి అనుమతులూ లేవని, తమ పంట పొలాల్లోకి జేసీబీలు, డోజర్లతో దౌర్జన్యంగా ప్రవేశించి భూమిని చదును చేశారని జనగామ-హుస్నాబాద్ మార్గంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోతున్నారు. పైగా అధికారులు, పోలీసులు ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతూ తమపై ఒత్తిడి తెస్తున్నారని రైతులు చెబుతున్నారు. అధికార యంత్రాంగమంతా ఎమ్మెల్యే కనుసన్నుల్లోనే పనిచేస్తోందని ఆరోపిస్తున్నారు. తాము కోర్టుకు వెళ్తామనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తన అంగబలంతో.. నష్టపోయిన భూమికి పరిహారం ఇస్తానంటూ బుజ్జగింపులకు దిగినట్లు రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పెద్దలు స్పందించి ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Mar,2021 07:35AM