హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు షూటింగ్ సమయంలో గాయపడడం చాలానే చూస్తున్నాం. ఒకప్పుడు రిస్కీ స్టంట్స్‌ని డూప్స్ చేసేవారు. ఇప్పడలా కాదు, హీరోలే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా కన్నడ నటుడు రిషబ్ శెట్టి పెట్రోల్ బాంబ్ ప్రమాదంలో గాయపడ్డాడు. వివరాలలోకి వెళితే రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో హీరో అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమా పోరాట దృశ్యాలను హాసన్ జిల్లా బేలూరులో చిత్రీకరిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ సమయంలో రిషబ్, గానావి లక్ష్యణ్ పెట్రోల్ బాంబ్ విసిరి పారేసి పోతున్న సమయంలో వారికి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పి ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికి పెద్ద ప్రమాదం ఏమి లేదని వైద్యులు చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm