కాన్పూర్: యూపీలోని కాన్పూర్ దెహాత్లో ట్రాలీ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. నిన్న అర్థరాత్రి బొగ్గులోడుతో వెళుతున్న ట్రాలీ మవూ ముగల్ రోడ్డు దగ్గర బోల్తాపడింది. దీంతో ట్రాలీలో ఉన్న కూలీలంతా దాని కింద చిక్కుకుపోయారు. వీరిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కూలీలు హమీర్పూర్ జిల్లాలోని వర్నావ్, కలౌలీ, తీర్ గ్రామాలకు చెందినవారు. వీరంతా ట్రాలీలో కూర్చుని కూలి పనుల కోసం ఇటావాలోని సిర్సాగంజ్ వెళుతున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఆరు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm