హైదరాబాద్: కరోనా వైరస్ వచ్చాక మన జీవన శైలి మారింది. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ హబ్ అయిన హైదరాబాద్ హైటెక్ సిటీలో ఈ కల్చర్ బాగా పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి చాలా మంది ఇళ్లనే ఆఫీసు డెస్కులుగా మార్చుకున్నారు. ఇందుకోసం ఉన్న ఇల్లు సరిపోదు అనుకున్న చాలా మంది పెద్ద ఇళ్లు కొనుక్కున్నారు. లగ్జరీ హౌస్‌లలోకి మారారు. ఒక్కొక్కటీ 2000 చదరపు అడుగులు ఉండేవి ఎంచుకుంటున్నారు. దాంతో... రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పెరిగింది. ఇళ్లకు డిమాండ్ ఎక్కువైంది. అద్దెలు కూడా పెరిగిపోయాయి. 2014 నుంచి 2020 వరకూ... హైదరాబాద్‌లో ఇళ్ల అద్దెలు 26 శాతం పెరిగాయి. ఇండియాలోని 7 ప్రధాన మెట్రో నగరాలతో పోల్చితే... అద్దెలు ఇక్కడే ఎక్కువ పెరిగాయి. అనరాక్ ప్రాపర్టీ కన్సల్టాంట్స్ జరిపిన సర్వేలో ఈ విషయం తేలింది.
హైదరాబాద్ లాగానే ఐటీ హబ్‌గా మారుతున్న గుర్గావ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో నెల వారీ అద్దెలు 17 శాతం పెరిగాయి. హైదరాబాద్‌లో వాణిజ్య సముదాయాలు పెరగడం కూడా అద్దెలు పెరగడానికి ఓ కారణంగా చెబుతున్నారు. హైదరాబాద్ లాగానే ఐటీ హబ్‌గా మారుతున్న గుర్గావ్‌లో... గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో... నెల వారీ అద్దెలు 17 శాతం పెరిగాయి. హైదరాబాద్‌లో వాణిజ్య సముదాయాలు పెరగడం కూడా అద్దెలు పెరగడానికి ఓ కారణంగా చెబుతున్నారు. మున్ముందు కూడా అద్దెలు మరింత పెరిగే అవకాశం ఉండొచ్చంటున్నారు. ఈ సంవత్సరం ఇళ్ల అద్దెలు 3 శాతం నుంచి 7 శాతానికి పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఆఫీసులను లీజుకు తీసుకుంటున్నంతకాలం ఇళ్ల అద్దెలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు 2014 నుంచి ఏటా 3 నుంచి 6 శాతం వృద్ధి చెందుతున్నాయి.
కరోనా వచ్చినప్పుడు అన్ని రంగాల లాగే రియల్ ఎస్టేట్ కూడా పడిపోయినా ఆ తర్వాత త్వరగానే కోలుకుంది. ఇప్పుడు లగ్జరీ అపార్ట్‌మెంట్లను లీజుకు కోరే వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని లొకాలిటీల్లో నెల వారీ అద్దెలను ఇప్పుడిప్పుడే పెంచుతున్నారు. తెలంగాణలో కూడా అందిరికీ వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతోంది కాబట్టి... ఆర్థిక పరిస్థితులు మరింత పుంజుకునే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Mar,2021 11:27AM