హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రం అసోంతోపాటు అండమాన్ దీవుల్లో భూకంపాలు సంభవించాయి. సోమవారం అర్థరాత్రి 11.51 గంటలకు అండమాన్ దీవుల్లో భూమి కంపించగా.. ఈ తెల్లవారుజామున 1.32 గంటలకు అసోంలోని మొరిగావ్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఈ ఉదయం ఈ విషయాన్ని వెల్లడించింది. అందరూ నిద్రిస్తున్నవేళ అకస్మాత్తుగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. అండమాన్ దీవుల్లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm