- సరితకు బెస్ట్ ప్లేయర్ అవార్డు
నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర స్థాయి హాకీ చాంపియన్ షిప్ లో జిల్లా బాలికలు రన్నరప్ ట్రోఫీనీ అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్, సబ్ జూనియర్ బాలికల హాకీ టోర్నీ సోమవారం సాయంత్రంతో ముగిసింది. రాష్ట్రంలోని సుమారు 13 జిల్లాల జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. అయితే లీగ్ విధానంలో నిర్వహించిన ఈ టోర్నీలో జిల్లా బాలికలు దూకుడుగా ఆడారు. మొదటి మ్యాచ్ లోనే మహబూబ్ నగర్ జట్టుతో తలపడి 3-0 గోల్ ల తేడాతో ఏకపక్షంగా విజయం సాధించి శుభారంభం పలికారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో ఖమ్మం జట్టును సైతం 3-1 గోల్ ల తేడాతో ఓడించారు. దీంతో సెమీఫైనల్స్కు చేరుకొని రంగారెడ్డి జిల్లా జట్టుతో తలపడ్డారు. ఇందులోనూ ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. నిర్ణీత ఆట సమయంలో ఇరు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయి. అనంతరం టోర్నీ విధి విధానాలను అనుసరిస్తూ 8 సెకండ్ ల స్కూబ్స్ కేటాయించగా ఇందులోనూ ప్రత్యర్థులను 4-3 గోల్ ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకున్నారు. ఇక తుది పోరులో ను ఇరు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ రెండు జట్లు ఆద్యంతం అమీ తుమి లా పోరాడి ఇరు జట్లు ఒక గోల్ కూడా చేయకపోవడంతో సమఉజ్జీలుగా నిలిచారు. ఫైనల్ మ్యాచ్ లోనూ నిబంధనలను అనుసరిస్తూ ఎనిమిది సెకండ్ల స్కూప్స్ కేటాయించారు. అయితే ఇందులో హైదరాబాద్ జట్టు నాలుగు గోళ్ళు చేయగా నిజామాబాద్ జిల్లా జట్టు మూడు గోల్ లు చేసి స్వల్ప తేడాతో విన్నర్ ట్రోఫీ నీ చేజార్చుకున్నారు. దీంతో రన్నరప్ ట్రోఫీని దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లా జట్టు తరపున ఆడిన సిరికొండ మండలం తూంపల్లి గ్రామానికి చెందిన సరిత అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి రాష్ట్రస్థాయిలోనే బెస్ట్ ప్లేయర్ గా అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా జరిగిన ముగింపు కార్యక్రమానికి హాకీ త్రిబుల్ ఓలంపియన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, అర్జున అవార్డి, తెలంగాణ రాష్ట్ర హాకీ అసోసియేషన్ సెక్రెటరీ ముఖేష్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు రన్నరప్ ట్రోఫీని, సిల్వర్ మెడల్ లను బహూకరించారు. జిల్లా బాలికల జట్టుకు గురుకులం డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ యు. సంధ్య కోచ్ గా వ్యవహరించారు. ఆర్మూర్ కు చెందిన పీఈటి శ్రీనివాస్ మేనేజర్ గా వ్యవహరించారు. జిల్లా బాలికల జట్టు రన్నరప్ ట్రోఫీని అందుకోవడం పట్ల నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు విశాఖ గంగారెడ్డి, కార్యదర్శి సదమస్తుల రమణ, కోశాధికారి పింజా సురేందర్, సంయుక్త కార్యదర్శి దండుగుల చిన్నయ్య, కార్యవర్గ సభ్యులు నాగేష్, సంతోష్ ఠాకూర్ తదితరులు జిల్లా జట్టు సభ్యులను అభినందించిన హర్షం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Mar,2021 12:55PM