హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత స్టాలిన్ పై అన్నాడీఎంకే ట్రాన్స్ జెండర్ ను పోటీకి దింపనుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగనున్న వేళ.. ప్రధాన పార్టీలన్నీ సీట్ల పంపకాలను ముమ్మరం చేశాయి. ప్రధాన పార్టీలన్నీ వచ్చేవారం తమ అభ్యర్థుల వివరాలను ప్రకటించనున్నాయి. అయితే స్టాలిన్ పై ట్రాన్స్ జెండర్ కార్యకర్త అప్సరా రెడ్డిని బరిలోకి దింపాలని అన్నాడీఎంకే భావిస్తోంది. స్టాలిన్ సొంత నియోజకవర్గమైన కొలతూర్ నుంచి పోటీ చేసేందుకు అప్సర సైతం ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Mar,2021 01:15PM