- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్
హైదరాబాద్: ముద్ర రుణాల మంజూరులో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ ఆరోపించారు. ఈ మేరకు వినోద్ మంగళవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ముద్ర రుణాల మంజూరులో బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని లేఖలో విమర్శించారు. రుణాల మంజూరులో విషయంలో తెలంగాణకు న్యాయం చేయాలని వినోద్ డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన 68 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా.. 40.9లక్షల మందికే ఇచ్చారని, మిగతా 28 లక్షల మందికి రుణాలు మంజూరు చేయాలన్నారు. రుణాల లక్ష్యాలను బ్యాంకుల వారీగా నిర్దేశించి అమలు చేయాలని, రాష్ట్రంలో అర్హులైన చిరు వ్యాపారులు, నిరుద్యోగులకు ముద్ర పథకం కింద వెంటనే వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని వినోద్ కేంద్ర ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో కోరారు.