విజయనగరం: విజయనగరం జిల్లాలో గుర్ల వద్ద ఓ డిగ్రీ విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టేసి తుప్పల్లో పడేసినట్లుగా నమోదైన కేసులో మిస్టరీ వీడింది. తన కుటుంబసభ్యులను నమ్మించేందుకు ఆ విద్యార్థినే కట్టుకథ అల్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్నేహితులతో బయటకు వెళ్లినట్లు ఇంట్లో తెలిసిపోతుందని ఆమె ఈ నాటకమాడింది. కుటుంబసభ్యులను నమ్మించేందుకు తనని తానే కాళ్లు, చేతులు కట్టుకున్నట్లు ఆమె పోలీసుల విచారణలో అంగీకరించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజకుమారి ఓ ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు.
డిగ్రీ విద్యార్థిని ఫిబ్రవరి 27న బాబాయ్ దగ్గరకు వెళ్తానని చెప్పి హాస్టల్‌లో పర్మిషన్ తీసుకుని తనకు తెలిసిన స్నేహితుడిని కలిసేందుకు బయటకు వెళ్లింది. అదే సమయంలో ఆమె సోదరుడు తన గురించి హాస్టల్‌లో వాకబు చేసినట్లు తెలుసుకుంది. స్నేహితుడిని కలిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో పాలకొల్లు నుంచి పాలకొండ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కింది. గుర్ల దాటిన తర్వాత బస్సు దిగిన యువతి.. రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లి తనకు తానే కాళ్లు, చేతులను చున్నీతో కట్టుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లుగా నటించినట్లు అంగీకరించింది అని ఎస్పీ రాజకుమారి తెలిపారు. పోలీసులు ఈ కేసును 48 గంటల్లోనే ఛేదించారని ఎస్పీ వెల్లడించారు. వారిని అభినందిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు.
ఇదీ చదవండి
స్వీట్స్ పంచి .. 8 ఇండ్లు దోచేశారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 03 Mar,2021 09:06PM