విజయవాడ: టీడీపీ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశారు. మాగంటి బాబు తనయుడు మాగంటి రాంజీ బుధవారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన విజయవాడలోని ఆంధ్రా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాంజీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. పలువురు టీడీపీ నేతలు మాగంటి బాబును పరామర్శిస్తున్నారు. రాంజీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఐతే రాంజీ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారో కారణాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm