హైదరాబాద్: బుధవారం రాత్రి శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సిక్సుల వర్షం కురిపించాడు. ఒకే ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు నమోదు చేశాడు. శ్రీలంక స్పిన్నర్ అఖిల ధనంజయ వేసిన ఒక ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సిలు బాదాడు. పొలార్డ్ ధాటికి విండీస్ 131 పరుగుల లక్ష్యాన్ని 13.1ఓవర్లలోనే ఛేదించింది. సౌత్ ఆఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ హర్షలీ గిబ్స్, భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత ఆరు బంతుల్లో ఆరు సిక్సులు నమోదు చేసిన ఘనత కీరన్ పొలార్డ్ సాధించాడు.
Mon Jan 19, 2015 06:51 pm