హైదరాబాద్ : అతడి పేరు విష్ణు తివారీ ఊరు.. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్. 23 ఏండ్ల వయసులో ఓ లైంగికదాడి కేసులో అరెస్టయ్యాడు. మూడేళ్లు జైల్లో జీవితం గడిపిన తరువాత.. కోర్టు అతనిని దోషిగా తేల్చి 10 ఏండ్లు జైలు శిక్ష వేసింది. అదే కేసులో ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కోర్టు అతనికి జీవిత ఖైదువిధించింది. అతడు హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ కేసు సాగుతూ వచ్చింది. ఇరవై ఏండ్లు గడిచిపోయాయి. చివరికి ఈ జనవరిలో అతడు నిర్దోషి అని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో.. అతడు బుధవారం జైలు నుంచి విడుదలయ్యాడు. చేయని నేరానికి 20 ఏండ్లు జైల్లో మగ్గిన తరువాత ఇప్పుడు నిర్దోషిగా విడుదల అవుతున్న క్షణంలో అతడి కళ్లలో నైరాశ్యం, దేహంలో నీరసం నెలకొని ఉన్నాయి. జైలు నుంచి తీసుకెళ్లేందుకు కూడా ఎవరూ రాలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు బయటికొచ్చి నేనేం చేయగలను. జైల్లోనే నా ఒళ్లు హూనమైపోయింది. నా కుటుంబం కూడా నాశనమైపోయింది. ఓ సోదరుడు మినహా.. నాకంటూ ఎవరూ లేకుండా పోయారు. నా జీవితం జైల్లో వంట గదికే పరిమితమైపోయింది. ఈ రోజు విడుదలయ్యే నాటికి నా చేతిలో రూ. 600 మాత్రమే ఉంది అంటూ వాపోయాడు. ఎక్కడో జరిగిన తప్పునకు సగం జీవితమే కాదు కుటుంబాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు.
Click Here
కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 04 Mar,2021 10:40AM