హైదరాబాద్: సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ పంచనారసింహ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం సీఎం కేసీఆర్ ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm