హైదరాబాద్ : హీరో నాగచైతన్య కోసం ఓ అభిమాని నదిలోకి దూకాడు. దీంతో నాగచైతన్య నటిస్తున్న చిత్రం షూటింగ్ కి ప్యాకప్ చేప్పల్సి వచ్చింది. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న మూవీ 'థ్యాంక్యూ'. ఈ చిత్రం షూటింగ్ ఈస్ట్ గోదావరిలో జరుపుకుంటోంది. దీంతో షూటింగ్ సెట్స్‌కు అక్కినేని అభిమానులంతా క్యూ కడుతున్నారు. అయితే అక్కడ నదిలో నాగచైతన్యతో ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఓ వీరాభిమాని చైతును చూసేందుకు ఏకంగా నదిలోకే దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే చిత్రీకరణ మధ్యలో అభిమాని నదిలో దూకడంతో షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో డైరెక్టర్ షూటింగ్‌కు ప్యాకప్ చెప్పాడు. ఆ తర్వాత చైతు సదరు అభిమానిని కలిసి ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దని చెప్పి, కాసేపు అతడితో మాట్లాడాడు. అనంతరం అభిమానితో ఫొటో దిగి తిరిగి పింపించాడు.
Mon Jan 19, 2015 06:51 pm