హైదరాబాద్ : ప్రముఖ మలయాళ నటుడు, హీరోయిన్ నజ్రియా నజీమ్ భర్త ఫాహద్ ఫాసిల్ షూటింగ్‌లో గాయపడ్డారు. కొచ్చిలో 'మలయన్కుంజు' సినిమా చిత్రీకరణ సమయంలో బిల్డింగ్ పై నుంచి దూకే సన్నివేశంలో ప్రమాదం జరిగింది. బ్యాలెన్స్ అదుపుతప్పి నటుడు బిల్డింగ్‌పై నుంచి పడిపోయినట్లు సమాచారం. దీంతో వెంటనే ఆయన్ను కొచ్చిలోని ఓ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు బలమైన గాయం కాగా, కొన్ని స్వల్ప గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని పేర్కొన్నారు.
విషయం తెలిసిన వెంటనే ఫాహద్ భార్య, నటి నజ్రియా ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు తమ హీరో త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు ప్రార్దిస్తున్నారు. ప్రస్తుతం మలయాళంలో అరడజనుకు పైగా సినిమాల్లో ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 04 Mar,2021 03:56PM