హైదరాబాద్ : మెదక్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మంటల్లో కాలి తల్లీకూతుళ్లు సజీవదహనమయ్యరు. మెదక్ మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన గట్టయ్య సీఆర్పీగా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా కుటుంబంతో సహా మెదక్లోని స్థానిక అజంపుర కాలనీలో నివాసముంటున్నాడు. రోజు మాదిరిగానే గురువారం గట్టయ్య విధి నిర్వహణకు వెళ్లగా... భార్య రేవతి ఇంట్లో వంట చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు చీర కొంగుకు నిప్పంటుకుంది. రేవతితో పాటు ఆమె కూతురు ఆద్యశ్రీకి కూడా మంటలు అంటుకున్నాయి. తల్లి కూతురు ఇద్దరు మంటల్లో కాలిపోయారు. కేకలు విని చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm