హైదరాబాద్ : కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు రాజీనామా చేశారు. ఎన్నికల ముంగిట్లో ఇలా కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం... అదీ రాహుల్ గాంధీ నియోజకవర్గం కావడం హాట్ టాపిక్‌గా మారింది. కేరళ ప్రజలు ఎల్‌డీఎఫ్‌కే అనుకూలంగా ఉందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించిన విషయం సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లడం ఎన్నికల ఫలితాలపై ఎఫెక్ట్ చూపిస్తుందన్న చర్చ జరుగుతోంది. మాజీ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు,మున్సిపల్ కౌన్సిలర్ కెకె విశ్వనాథన్,కేపీసీసీ సెక్రటరీ ఎంఎస్ విశ్వనాథన్,డీసీసీ జనరల్ సెక్రటరీ పీకే అనిల్ కుమార్,మహిళా కాంగ్రెస్ నేత సుజయ వేణుగోపాల్... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినవారిలో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం,వయనాడ్ జిల్లా కమిటీ తమను పట్టించుకోని కారణంగానే రాజీనామా చేసినట్లు కెకె విశ్వనాథ్ తెలిపారు. జిల్లా నాయకత్వంలో ఒక సామాజికవర్గానికి చెందినవారి ఆధిపత్యమే నడుస్తోందని ఆయన ఆరోపించారు. త్వరలోనే విశ్వనాథ్ సీపీఐ(ఎం) పార్టీలో చేరవచ్చునన్న ప్రచారం జరుగుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm