హైదరాబాద్ : తాకట్టులో ఉన్న పలు ఆస్తులను ఎస్‌బీఐ నేడు ఈ-వేలం వేయనుంది. నాణ్యమైన ఆస్తులను మార్కెట్ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇదో మంచి అవకాశమని ఎస్‌బీఐ పేర్కొంది. ఈ వేలంలో అన్నిరకాల ప్రాపర్టీలను విక్రయించనున్నట్లు తెలిపింది. నివాస ప్రాంగణాలు, గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య ఆస్తులు, కర్మాగారాలు, యంత్రాలు, వాహనాలు వంటివి వీటిల్లో ఉన్నట్లు ఎస్‌బీఐ గురువారం ఒక ట్వీట్‌లో పేర్కొంది. ఎవరైనా ఈ బిడ్‌లో పాల్గొనవచ్చని ఎస్‌బీఐ పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటనలను పలు ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. వేలంలో ఉంచిన ఆస్తుల వివరాలను సమగ్రంగా అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఇక తాకట్టులో ఉన్న ఆస్తులకు సంబంధించి ఆయా బ్రాంచిల్లో సంబంధిత అధికారుల వివరాలను కూడా ఇచ్చింది.
మీరు ఈ వేలం ప్రక్రియలో పాల్గొనాలనుకుంటే, ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో మీ ఇమెయిల్, మొబైల్ నెంబర్ ఆధారంగా పేరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు నో యువర్ కస్టమర్ ( SBI KYC ) కేవైసి ఫార్మాలిటీలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Mar,2021 06:40AM