హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో నాటుబాంబులు బయటపడ్డాయి. గొల్ల కంచిలి గ్రామంలోని ఓ గుడిసెలో నిల్వ చేసిన 42 బాంబులను పోలీసులు గుర్తించారు. అవి పేలకుండా వెంటనే వాటిని నీళ్లలో పడేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం ఓ వర్గం వీటిని ఒడిశా నుంచి తీసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm