హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. జిల్లాలోని ఇళ్ళంద కుంట మండలం, రామన్నపల్లి గ్రామానికి చెందిన వికలాంగురాలిపై లైంగికదాడి జరిగింది. ఒంటరిగా గొర్రెలను మేపుతున్న ఆమెకు అన్నారపు కోరయ్య అనే వ్యక్తి కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి ఆమెకు ఇచ్చి.. దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్నారపు కోరయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm