హైదరాబాద్: సరిహద్దుల్లో ఓ భారతీయుడిని నేపాల్ పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని పిలిబిత్ జిల్లాలో జరిగింది. ఆ ఘటన వివరాలను జిల్లా ఎస్పీ జై ప్రకాశ్ వెల్లడించారు. చనిపోయిన వ్యక్తిని గోవిందా (26)గా గుర్తించామన్నారు. పప్పూ సింగ్, గుర్మీత్ సింగ్ లతో కలిసి గోవిందా నేపాల్ లోకి ప్రవేశించాడని చెప్పారు. అయితే, సరిహద్దుల్లోని నేపాల్ పోలీసులతో ఏదో విషయమై వారు వాగ్వాదానికి దిగారని చెప్పారు.
ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరపడంతో గోవిందాకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయాడని తెలిపారు. ఓ వ్యక్తి భయంతో మళ్లీ భారత్ లోకి తిరిగొచ్చేయగా.. మరో వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనతో పిలిబిత్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా, భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులకు తెగబడడం ఇది కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. గత ఏడాది జూన్ లో ఇలాగే కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మృతి చెందగా.. నలుగురు గాయాలపాలయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Mar,2021 03:24PM