అమరావతి: అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్‌పై ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 10వ వార్డు పరిధిలో శ్రీరామ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జామియా మసీదు వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారంటూ అక్కడి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అధికారి నాగవల్లి ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పరిటాల శ్రీరామ్‌తో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm