హైదరాబాద్ : యువ హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా శర్వా కొత్త చిత్రం టైటిల్ పోస్టర్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాకు 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు తిరుమల కిశోర్ దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కనుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
Mon Jan 19, 2015 06:51 pm