హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఉప్పెన'. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషించగా.. కృతి శెట్టి కథానాయికగా తెలుగుతెరకు పరిచయమైంది. ఇక సినిమా విడుదల కాగానే, సూపర్ హిట్ అన్న టాక్ ఏకగ్రీవంగా వచ్చేసింది. ప్రేమకథల్లో ఒక సంచలనంగా నిలిచింది. సినిమాకు లభిస్తున్న ఆదరణను చూసి.. 'ఇది 100 కోట్ల సినిమా' అంటూ మొదటి రోజే కొందరు జోస్యం చెప్పారు. అనుకున్నట్టుగానే ఇప్పుడది నిజమైంది. తమ సినిమా 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. 'ఉప్పెనంత మీ ప్రేమకు ధన్యవాదాలు' అంటూ ఓ పోస్టర్ ను కూడా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm