హైదరాబాద్ : కొన్నిరోజుల కిందట సెనేట్ లో పాకిస్థాన్ అధికార పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) ఓటమిపాలైంది. దాంతో ఇవాళ పాక్ పార్లమెంటు దిగువ సభలో విశ్వాస పరీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 178 ఓట్లు లభించాయి. బలపరీక్ష నెగ్గేందుకు 172 ఓట్లు అవసరం కాగా, ఇమ్రాన్ కు 6 ఓట్లు అధికంగానే లభించాయి. పీటీఐ పార్టీకి చెందిన 155 మంది ఎంపీలు తమ అధినేత ఇమ్రాన్ కే ఓటేశారు. అంతేకాకుండా, బలూచిస్తాన్ అవామీ పార్టీ, ఎంక్యూఎం (పీ), గ్రాండ్ డెమొక్రటిక్ అలయెన్స్, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (క్వయిద్)కు చెందిన ఎంపీలు కూడా విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ కు మద్దతుగా నిలిచారు. ఓ స్వతంత్ర ఎంపీ కూడా ప్రధానికి బాసటగా నిలిచారు. తనకు ఓట్ చేసిన వారందరికీ ఇమ్రాన్ కృతజ్ఞతలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm