హైదరాబాద్ : వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన బీజేపీ మహిళా ఎంపీ ప్రగ్యా ఠాకూర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో హుటాహుటీన ముంబయి తరలించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఓ ప్రత్యేక విమానంలో ఆమెను ముంబయి తీసుకెళ్లారు. ప్రగ్యా ఠాకూర్ ప్రస్తుతం ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నెలరోజుల వ్యవధిలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవడం ఇది రెండోసారి.
Mon Jan 19, 2015 06:51 pm