హైదరాబాద్ : వృత్తిరీత్యా ఆంగ్ల ఉపాధ్యాయుడైన చిత్తలూరి సత్యనారాయణ ఏ అంశాన్నైనా క్షణాల్లో కవిత్వం చేయగల సమర్థుడు అని ప్రముఖ కవి యాకూబ్ అన్నారు. తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతచిత్తలూరి సత్యనారాయణ రాసిన 'మనిషి అలికిడి లేక' కవితా సంపుటిని యాకూబ్ ఆవిష్కరించారు. ఈ కవితా సంపుటీలో మానవసంబంధిత , సామాజిక విషయాలాంటి ఇలాంటి ఎన్నో అంశాల్ని ఆయన కవిత్వం చేశారని అన్నారు. కరోనా కాలాన్ని అక్షరాల్లో ఎంత చక్కగా పొందుపరిచారని తెలిపారు. ఈ కవితా సంపుటిని అసిస్టెంట్ ప్రొఫెసర్ కోయ కోటేశ్వరరావు పరిచయం చేశారు. ఈ సభలో ప్రముఖ కవులు రాజా హుస్సేన్,గుడిపాటి, తంగిరాల చక్రవర్తి, బోల యాదయ్య, భూపతి వెంకటేశ్వర్లు, అనంతోజు మోహన్ కృష్ణ, జి.నరేష్, కె.పి.లక్ష్మీ నరసింహ, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm