హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర 2021 -22 బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15వ తేదీ తర్వాత ప్రారంభం కానున్నాయి. కాగా ఈసారి బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సూచన ప్రాయంగా తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాల కోసం సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ధిక పద్దులో పొందు పరచాల్సిన శాఖల వారి బడ్జెట్ అంచనాలను, అధికారులు అందించిన ఆర్ధిక నివేదికలను పరిగణలోకి తీసుకుని సీఎం పరిశీలించారు.
Mon Jan 19, 2015 06:51 pm