హైదరాబాద్: మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి జాతరకు సికింద్రాబాద్, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ జగన్ పేర్కొన్నారు. శనివారం కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రామలింగేశ్వర స్వామి జాతరకు 300వందల ప్రత్యేక బస్సులను నడిపించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈసీఐఎల్, ఆఫ్జల్‌గంజ్, తార్నాక, రెజిమెంటల్‌బజార్, ఘట్కేసర్, ఉప్పల్ చౌరస్తా, అమ్ముగూడ, వెస్ట్ వెంకటాపురం ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించడానికి ఏర్పాట్లు చేశామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm